గంభీరావుపేట జూలై 1 మన వార్త ప్రతినిధి. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు పోలీసులు వివరాల ప్రకారంగంభీరావుపేట గ్రామంలో శ్రీరామ గ్రామ సంఘ ను లక్కిరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు జూన్ 30 తారీఖున ఉదయం 10 గంటలకు వచ్చి ందా 6 గంటలకు ఆఫీస్ కి తాళం వేసి ఇంటికి వెళ్ళినారూ,తిరిగి, మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి చూసేసరికి ఆఫీస్ తాళం పగలగొట్టి ఉన్నది లోపలి వెళ్లి చూడగా వస్తువులు చిందర వందరంగా పడి ఉన్నాయి. లోపల ఉన్న బీరువాలో వస్తువులను కిందపడే వేశారు, కానీ ఎలాంటి విలువైన వస్తువులు పోలేవు ,ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఆఫీస్ తలుపులు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు అని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని ఎస్సై ఎన్ రమాకాంత్ తెలిపారు.