జమ్మికుంట లో బస్సు ప్రమాదం…

జమ్మికుంట, ఫిబ్రవరి 6(మనవార్త) కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో బస్సు ప్రమాదం.పలువురికి స్వల్ప గాయాలు.హుజూరాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న ఆర్టీసీ అదుపుతప్పి బస్సు జమ్మికుంట పట్టణంలోని వంతెన గోడను ఢీకొట్టింది. పలువురు స్వల్పగాయాలయ్యయి.ఎదురుగా వస్తున్న వాహన్నాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

10వ వార్డులో మార్పుకు నాంది – మెుట్టల అనూష మహేష్ ప్రజా ప్రస్థానం*సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మెుట్టల అనూష మహేష్ ప్రజా ప్రస్థానం….

వేములవాడ ఫిబ్రవరి 05 (మన వార్త ) వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీ 10వ వార్డు అభ్యర్థిగా మెుట్టల అనూష మహేష్ ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజల నుంచి విశేష స్పందన పొందుతున్నారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచారం వార్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నేను వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తక్షణమే పరిష్కరించాల్సిన రెండు ప్రధాన సమస్యలను గమనించాను. డ్రైనేజీ, పారిశుధ్యం మరియు స్ట్రీట్ … Read more

4వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి చేతి గుర్తుపై మీ ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి* *మీ వాడిగా మీ ఇంటివాడిగా ఉంటూ వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తా – 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తోట రాజు* *తన మద్దతు దారులతో భారీ ర్యాలీ….

వేములవాడ ఫిబ్రవరి 05 (మన వార్త ) వేములవాడ పట్టణ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా తోట రాజు4 వ వార్డులో ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు వార్డు ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మీ వాడిగా వార్డులో ఉంటూ మీకు సేవ చేస్తానని వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ … Read more

15వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి* *చేతి గుర్తుపై మీ ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి* *మీ వాడిగా మీ ఇంటివాడిగా ఉంటూ వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తా – 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పుల్కం రాజు….

వేములవాడ ఫిబ్రవరి 05 (మన వార్త ) వేములవాడ పట్టణ 15 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా పుల్కం రాజు 15 వార్డులో ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు వార్డు ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మీ వాడిగా వార్డులో ఉంటూ మీకు సేవ చేస్తానని గతంలో కౌన్సిలర్ గా చేసిన అనుభవం నాకు ఉందని … Read more

10వ వార్డులో మార్పుకు నాంది – సంగీత శ్రీకాంత్ ప్రజా ప్రస్థానంసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిరిగిరి సంగీత శ్రీకాంత్ ప్రజా ప్రస్థానం

వేములవాడ ఫిబ్రవరి 04 (మన వార్త ) వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు అభ్యర్థి సిరిగిరి సంగీత శ్రీకాంత్ ఇంటింటా ప్రచారం ద్వారా ప్రజల్లోవిశేషస్పందనపొందుతున్నారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచారం వార్డులో ప్రత్యేక ఆకర్షణగా మారింది.రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదలు, మహిళలు, యువత సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని సంగీత శ్రీకాంత్ తెలిపారు.కాంగ్రెస్ … Read more

దొంగల దృష్టి ఆలయాలపై…కాపలా బాట పట్టిన గ్రామస్తులు…పెద్దమ్మ గుడి రక్షణకు వల్లంపట్లలో రాత్రి పహారా….

.ఇల్లంతకుంట,ఫిబ్రవరి 03 (మన వార్త ప్రతినిధి);రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో ఆలయాల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.ఇటీవలి కాలంలో పల్లె ప్రాంతాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు పూజా సామగ్రి, పుస్తె మట్టెలు,బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను అపహరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.ఈ పరిణామాలు గ్రామ ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసు శాఖ సూచనల మేరకు వల్లంపట్ల గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.మంగళవారం గ్రామంలోని పెద్దమ్మ … Read more

ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి26 వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామీ వాడకట్టు మనిషిగా మీలోని మనిషిగా మీ ముందుకు వస్తున్నభారీ మెజార్టీతో నన్ను గెలిపించండి26వ వార్డు అభ్యర్థి మామిండ్ల అమర్శ – లక్ష్మీ రాజం…

వేములవాడ ఫిబ్రవరి 03 (మన వార్త) వేములవాడ లోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మామిడ్ల అమర్శ – లక్ష్మీరాజం పోటీ చేస్తున్నారు నన్ను ఈ మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేసారు మీ వాడకట్టులోని మనిషిగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని నన్ను ఆశీర్వదించి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఓటు వేయడం మీ వంతు అభివృద్ధి చేయడం … Read more

వేములవాడ 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృత ప్రచారం – ప్రజల నుంచి అపూర్వ స్పందన…..

వేములవాడ, ఫిబ్రవరి 02 (మన వార్త) వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.ప్రచారంలో భాగంగా అర్చన నరేష్ ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధి కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాట్లు, … Read more

బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన తల్లిని, కొడుకుని చంపి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య…

బెజ్జంకి,జనవరి 31 (మన వార్త ప్రతినిధి )కన్నతల్లిని కుమారుడిని చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కన్నతల్లిని, కుమారుడుని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జక్కని సత్యనారాయణ వడ్లూరూ గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ గత కొన్ని రోజులు నుండి వారి యొక్క … Read more

గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి* సర్పంచ్ దూది మనీషా-శ్రీనివాస్ రెడ్డి…

చందుర్తి, జనవరి 27,మన వార్త.క్రీడాకారులు గెలుపోవటం లను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీషా – శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు.మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసి ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు,శరీరక బృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్రీడల నిర్వహణకు కృషి చేశామన్నారు. యువజన సంఘాలు,క్రీడాకారులు మరుగున పడిన … Read more