వేములవాడ ఏప్రిల్ 02 (మన వార్త ) వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం హనుమాన్ దేవాలయం ఆవరణలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులకు అల్పాహారం పులిహోర, స్వీట్,అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు 22 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఇప్పపూల మమత – అజయ్, మస్తాన్, ట్రస్టు నిర్వాహకులు పిల్లి బాబురావు చేతుల మీదుగా హనుమాన్ స్వాములకు, భక్తులకు అరటి పండ్లు పులిహోర పంపిణీ చేయడం జరిగింది. హనుమాన్ జయంతి కి వచ్చే భక్తులకూ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం తో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎద్దండీ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఇప్పపూల మమత – అజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్, సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబు రావు,సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏద్దండీ రాజు,కోశాధికారి దూలం భూమేష్ గౌడ్,బొడగేరాజు,వేముల సతీష్, హరిప్రసాద్, గోంటి నవీన్, రాచకొండరాజు,విద్య శ్రీ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు