అనుమతి లేని ప్రతిభ కాలేజీ పై చర్యలేవి..?

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, మార్చి 10, మనవార్త. హనుమకొండలో అనుమతి లేని ప్రతిభ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవడానికి మౌనం వహిస్తున్న డిఐఈఓ గోపాల్. ప్రతిభ జూనియర్ కళాశాల యాజమాన్యం డిఐఈఓ గోపాల్ కి భారీగానే ముడుపులు ముట్ట చెప్పిందని పలువురు విమర్శిస్తున్నారు. అందుకే ప్రతిభ కళాశాలపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం అధికారులకు ముడుపులు అందించి అంతకుమించి ఫీజుల భారం అంతా మాపై మోపి తమ ఇష్టానుసారంగా … Read more

యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి…..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటివరకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన హన్మంతరావు దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరిమ అగ్రవాల్*శుభాకాంక్షలు తెలియజేసిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు….

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -26 (మన వార్త ) జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ గా గరిమ అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి కలెక్టర్ గా గరిమ అగ్రవాల్ అక్టోబర్ 23 వ తేదీ 2025 న బాధ్యతలు స్వీకరించారు. గరిమ అగ్రవాల్ గారిని కలెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన … Read more

పుల్వామా అమరవీరులకు ఉప్పల్ రింగ్ రోడ్డులో ఘన నివాళులు — ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్)

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఫిబ్రవరి 15, మనవార్త. ఉప్పల్ రింగ్ రోడ్డులో పుల్వామా దాడిలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళుల కార్యక్రమం ఇర్షాద్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని దేశభక్తి భావాలతో సాగింది. అమరవీరుల చిత్రాలకు కొవ్వొత్తులు వెలిగించి, పూల వర్షం కురిపిస్తూ నివాళులు అర్పించారు. అనంతరం “అమర జవాన్లకు జై”, “భారత్ మాతాకి జై” వంటి దేశభక్తి నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది.ఈ సందర్భంగా ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ … Read more

గజ్వేల్ మున్సిపాలిటీలో ఎస్సీలకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి- మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి….

.రాయపోల్ ఫిబ్రవరి 13 (మన వార్త):గజ్వేల్ మున్సిపాలిటీలో ఎస్సీ వర్గాలకు వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని విమర్శించారు.మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చైర్మన్ కాగా ఓసీలకు వైస్ చైర్మన్ పదవి దక్కిందని, రెండోసారి ఓసీలు చైర్మన్‌గా, మైనార్టీలకు వైస్ చైర్మన్‌గా అవకాశం లభించిందని గుర్తుచేశారు. … Read more

సిఐటీయు ఆధ్వర్యంలో రాయపోల్‌లో నిరసన…

ఫిబ్రవరి 12 మన వార్త రాయపోల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాయపోల్ మండల అధ్యక్షులు పొట్టెల స్వామి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపుతో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటీయు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి, కార్మిక చట్టాలను రద్దు చేయాలని, … Read more

దొంగతనాల భయంతో గుగ్గిళ్లలో రాత్రి కాపలాగా గోరుకలుప్రతి ఇంటి నుంచి చందా…గ్రామ రక్షణకు ఇద్దరు గోరుకలు నియామకం….

.బెజ్జంకి,ఫిబ్రవరి 12 (మన వార్త ప్రతినిధి);సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పరిసర గ్రామాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో గుగ్గిళ్ల గ్రామపంచాయితీ పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో గ్రామ రక్షణ కోసం ఇద్దరు గోరుకలను నియమించారు.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.50 వరకు చందా సేకరించి,రాత్రి వేళల్లో గ్రామంలో పహారా కాయడానికి వారిని ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.రాత్రి సమయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ … Read more

అంబులెన్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన 108 ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్…

గజ్వేల్ ఫిబ్రవరి 11 మన వార్త ప్రతినిధి గజ్వేల్ పట్టణంలోని 108 102 1962 అంబులెన్స్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ బోయిని సంపత్. తనిఖీల్లో భాగంగా అంబులెన్స్ లోని అత్యవసర మెడిసిన్ ను , రికార్డులను పరిశీలించారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు అత్యవసర సమయాల్లో అతి తక్కువ సమయంలో అందరికీ అంబులెన్స్ అందే విధంగా పనిచేయాలని సూచించారు. విధులలో ఉన్న సిబ్బంది చక్రపాణి, ఆరోగ్యం, … Read more

మేడారంలో దుస్తులు మార్చుకోడానికి మహిళలు ఇబ్బందులు…

ములుగు పిబ్రవరి 8మేడారం జాతరలో జంపన్న వాగు దగ్గర స్నానం చేసిన భక్తులు,మహిళలాకు బట్టలు మార్చుకొనుటకు ఇబ్బంది పడుతున్నారు.జాతర సమయంలో జంపన్న వాగు దగ్గర దుస్తులు మార్చుకొనుటకు రేకులతో డబ్బాలు ఏర్పాటు చేయగా జాతర అయిపోయివడంతో బట్టలు మార్చుకోను 2 రేకు డబ్బులను ఉంచి, అన్ని డబ్బాలను తీసుకొనిపోయారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు రావడంతో స్నానం చేయుటకు నల్లాలు చరిపోయేంత లేక, మహిళలు దుస్తులను మార్చుకొనుటకు నలుగురు మహిళ చుట్టు చిరాను … Read more

జమ్మికుంట లో బస్సు ప్రమాదం…

జమ్మికుంట, ఫిబ్రవరి 6(మనవార్త) కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో బస్సు ప్రమాదం.పలువురికి స్వల్ప గాయాలు.హుజూరాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న ఆర్టీసీ అదుపుతప్పి బస్సు జమ్మికుంట పట్టణంలోని వంతెన గోడను ఢీకొట్టింది. పలువురు స్వల్పగాయాలయ్యయి.ఎదురుగా వస్తున్న వాహన్నాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.