పదవ తరగతి పరీక్షల్లో బీరెల్లి హాసిని ప్రతిభ…..

జగిత్యాల జిల్లా. ఏప్రిల్ 30 (మన వార్త ) జగిత్యాల జిల్లాకు చెందిన బీరెల్లి హాసిని పదవ తరగతి పరీక్షల్లో 581 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది.హాసిని క్రమశిక్షణతో చదువుతూ ఈ విజయాన్ని సాధించిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ హాసిని మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. , స్నేహితులు హాసినిని అభినందించారు.

ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు..పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మనోహర్ వైస్ చైర్మన్ తో పాటు న్యాయవాదుల సంఘం కార్యవర్గాన్ని సన్మానించిన ఆర్యవైశ్యులు ……

.వేములవాడ ఏప్రిల్ 26 (మన వార్త )శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం సన్నిధిలో సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వాసవి మాతకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి మాత ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆమె చూపిన అహింసా మార్గాన్ని అందరూ … Read more

ప్రభుత్వ పండుగగా వాసవి మాత జయంతి ఘన నిర్వహణజిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు – ఆర్యవైశ్య సంఘాల హర్షం……

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (మన వార్త ) తెలంగాణ ప్రభుత్వం వాసవి మాత జయంతిని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బుస దశరథం, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కటకం సత్తయ్య, వేములవాడ పట్టణ అధ్యక్షుడు … Read more

ఘనంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు..పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మనోహర్ వైస్ చైర్మన్ తో పాటు న్యాయవాదుల సంఘం కార్యవర్గాన్ని సన్మానించిన ఆర్యవైశ్యులు …….

వేములవాడ ఏప్రిల్ 26 (మన వార్త ) శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం సన్నిధిలో సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వాసవి మాతకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి మాత ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆమె చూపిన అహింసా మార్గాన్ని … Read more

రాంపల్లి శ్రీ రాజేశ్వర కాలనీలో భారీ అక్రమ నిర్మాణం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఏప్రిల్ 20, మనవార్త. రాంపల్లి శ్రీ రాజేశ్వర కాలనీలో స్ట్రీట్ నంబర్ 5లో యదేచ్చగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణం. గతంలో అక్రమ నిర్మాణం అంటూ పనులు ఆపిన అధికారులు. ఇంతలో అధికారులను మేనేజ్ చేశాను అంటూ దర్జాగా పనులు కొనసాగిస్తున్న సదరు అక్రమ నిర్మాణదారుడు. సంబంధిత అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మాణం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో అనుమతించబడిన నిర్మాణ పరిమితి G+2 మాత్రమే ఉండగా, నిర్మాణదారుడు అదనంగా … Read more

మాంస వ్యర్థాలపై తక్షణమే స్పందించిన సర్పంచ్ మామిడి రాజు..

నోటీసులు జారీ చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్….. ఇల్లంతకుంట మండలం ,ఏప్రిల్ 21 (మనవార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులపై చికెన్ సెంటర్ యజమానులు మాంస వ్యర్థాలు వేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం “మనవార్త” లో ప్రచురితమైన వార్తకు వెంటనే స్పందించిన సర్పంచ్ మామిడి రాజు,గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌తో కలిసి చర్యలు చేపట్టారు.చికెన్,మటన్ సెంటర్ యజమానులతో మాట్లాడి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు వారికి నోటీసులు జారీ … Read more

నిద్రలో అధికారులు..రోడ్డుపై మాంస వ్యర్థాల రాజ్యం..!చికెన్,మటన్ సెంటర్ల చెత్తతో దుర్వాసన–ప్రమాదాలకు అడ్డాగా మారిన ప్రధాన రహదారి…

,ఏప్రిల్ 21 (మన వార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి అనంతారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఇప్పటికే పలుమార్లు సమస్య వెలుగులోకి వచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.మండల కేంద్రం కావడంతో నిత్యం వందలాది వాహనాలు,పరిసర గ్రామాల ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు.ఇలాంటి ప్రధాన రహదారి చెత్తాచెదారాలు,మాంస వ్యర్థాలతో నిండిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.మండల అధికారుల నిర్లక్ష్యం కారణంగా చికెన్,మటన్ సెంటర్ల నిర్వాహకులు మాంస వ్యర్థాలు,చెత్తాచెదారాలను … Read more

జాలిగామ గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య…..

గజ్వేల్ ఏప్రిల్ 04 (మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శనివారం రోజు ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మణ్ (29) అనే కౌలు రైతు ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు లక్ష్మణ్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యవసాయమే జీవనాధారంగా నమ్ముకున్న ఆయన, అప్పులు చేసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో పంట … Read more

చిన్నహనుమాన్ జయంతిసందర్బంగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు పులిహోర,స్వీట్,అరటిపండ్లు వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం…

వేములవాడ ఏప్రిల్ 02 (మన వార్త ) వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం హనుమాన్ దేవాలయం ఆవరణలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులకు అల్పాహారం పులిహోర, స్వీట్,అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు 22 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఇప్పపూల మమత – అజయ్, మస్తాన్, ట్రస్టు నిర్వాహకులు పిల్లి బాబురావు చేతుల మీదుగా హనుమాన్ స్వాములకు, … Read more

పట్టించుకోని అధికారులు..!చెత్త కుప్పలు వేయడం…రాత్రి సమయంలో కాల్చివేయడం–ప్రమాదాలకు నిలయం…

ఇల్లంతకుంట,ఏప్రిల్ 02 (మన వార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి అనంతారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి చెత్త కుప్పగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.సుమారు 20 రోజుల క్రితం అనంతారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై “మనవార్త”లో ప్రచురితమైనప్పటికీ ఇప్పటివరకు అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.బుధవారం రాత్రి సమయంలో మరోసారి రహదారిపై చెత్తాచెదారాలు పారేసి వాటిని కాల్చివేయడం జరిగినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం మేరకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించగా రహదారిపై చెత్తాచెదారాలతో పాటు మాంస వ్యర్థాలు … Read more