వేములవాడ,మే 10( మన వార్త )వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణకట్ట వెళ్లే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డు ఒక భాగం ఊడిపడి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపిస్తోంది. బోర్డు మధ్య భాగంలో ఇనుప ఫ్రేమ్ బయటపడటంతో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ వేలాది మంది భక్తులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో బోర్డు భాగం ఎప్పుడైనా కింద పడే ప్రమాదం ఉందని స్థానిక భక్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో భారీగా భక్తులు సంచరించే ప్రాంతం కావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న బోర్డును తొలగించి, కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.