యువకుడ్ని కాపాడిన ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్ కుమార్.* అధికారుల నిర్లక్ష్యంతో గతంలో మా తండ్రి మరణం* మళ్లీ మాకు పట్టా అమలు చేయక నిర్లక్ష్యం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నాను* లొల్లేటి విశ్వతేజ అలియాస్ లడ్డు రెవెన్యూ అధికారులపై సంచలన ఆరోపణలు…

ఎల్కతుర్తి అక్టోబర్ 29 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండల పరిధిలో చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లిటి విశ్వతేజ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడబోయే సంఘటన చోటు చేసుకుంది.రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మరో విషాదానికి దారితీసింది. ఎన్నో ఏళ్లుగా భూమి పట్టా అమలు చేయమని తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఇదే కారణంతో గతంలో రెవెన్యూ అధికారుల మాటలు నమ్మి చివరికి పట్టించుకోకపోవడంతో లొల్లేటి విశ్వ తేజ తండ్రి లొల్లేటి రమేష్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పట్లో కొంతమంది రెవెన్యూ అధికారులు “పట్టా అమలు చేస్తాం” అని నచ్చజెప్పి చివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మా తండ్రి ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.తండ్రి మరణం తర్వాత కూడా అధికారులు పట్టా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో లొల్లేటి విశ్వతేజ తీవ్ర నిరాశకు గురయ్యాడు. బాధతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ. ప్రవీణ్‌కుమార్, సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకోని లొల్లేటి విశ్వతేజకు నచ్చజెప్పి కిందకు దించారు.సంఘటన స్థలానికి చేరుకున్న కొంతమందిగ్రామ ప్రజలు మాట్లాడుతూ “న్యాయబద్ధమైన పత్రాలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని పట్టా అమలు చేయక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు మండల వ్యాప్తంగా ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి” అని గ్రామస్తులు తెలిపారు.

Leave a Comment