పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 8 మంది పేకాట రాయుల అరెస్ట్…

చేగుంట అక్టోబర్ 21 ( మన వార్త ప్రతినిధి )పేకాట ఆడుతున్న ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.జిల్లా ఎస్పీ ఆదేశాల తో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా మండల కేంద్రమైన చేగుంట లో సోమవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న స్థావరం పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.58,060/- నగదు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను మరియు స్వాధీనం చేసిన వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Comment