తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 26, మనవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది. రాష్ట్ర పోలీసు విభాగంలో పలు కీలక హోదాల్లో సేవలందించిన ఆయనను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ బాధ్యతలకు నియమించారు. ఇప్పటి వరకు డీజీపీగా పనిచేసిన అధికారిని తప్పించి, శివధర్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకంతో రాష్ట్రంలో నూతన పోలీసు పరిపాలన విధానం అమలులోకి రానుందని అధికారులు పేర్కొన్నారు.