వేములవాడ పట్టణంలో మహిళలకు కోలల పంపిణీ….

రాజన్న సిరిసిల్ల జిల్లా /వేములవాడ సెప్టెంబర్ 21 ( మన వార్త ప్రతినిధి )వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్ 26వ వార్డులో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కోలల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిళ్ల లక్ష్మీరాజు మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా కోలలు అందజేశారు.బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, మహిళల ఆనందోత్సాహాలకు ఇది వేదికవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో వార్డు మహిళలు, నాయకులు అన్నం నరసయ్య, రాజేందర్, వెలిశాల శ్రీకాంత్, పంబ శ్రీకాంత్, గంగాధర్, వేణు, రాకేష్, మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment