చిల్కానగర్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 18, మనవార్త.

చిల్కానగర్ బ్రహ్మంగారి గుట్ట మీద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో కుల పెద్దలు, మహిళలు, పిల్లలు ఎంతో హుషారుగా, ఉత్సాహంగా పాల్గొని ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిపారు. విశ్వబ్రాహ్మణులు, మహిళలు అందరూ కలసి విశ్వకర్మ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని చిలకానగర్ వీదుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తూ జై విశ్వకర్మ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోతుకునూరి సీతారాములు చారి,ప్రధాన కార్యదర్శి, అలుగోజు ప్రసాద్ చారి,కోశాధికారి కట్టోజు వెంకట రామ నర్సయ్య చారి, సలహాదారులు వడ్లూరి రాజయ్య చారి, కొండోజు అశోక్ చారి, మారోజు లక్ష్మీ నారాయణ చారి, చింతపట్ల బ్రహ్మచారి,పబ్బోజు పాండు చారి,చేపూరి బ్రహ్మచారి, చేపూరి వీరాచారి, రాళ్ళబండి నరసింహ చారి, యెర్రోజు వినోద్ చారి, కోతోజు చంద్రం చారి,ఎల్లంకి సత్యనారాయణ చారి, గన్నోజు సదానందం చారి, మాచర్ల రవీంద్ర చారి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment