మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, సెప్టెంబర్ 18 మన వార్త : అల్వాల్ పరిధిలోని పారడైజ్ నుండి షామీర్‌పేట్ వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులలో భాగంగా ప్రభావితమవుతున్న ప్రజల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా భూ సేకరణ ప్రత్యేక శ్రేణి అధికారి & డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం రాబోయే శుక్రవారం (19-09-2025) ఉదయం 12 గంటలకు మేడ్చల్–మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో జరగనుంది.ఈ సమావేశంలో భూ సేకరణ, నష్టపరిహారం తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరగనున్నాయి. కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభావితమవుతున్న ప్రజలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.