వేములవాడ ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2569 వ బౌద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో లుంబినిలోని కోశాలరాజా కుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు రాజుగా రాజ్యాన్ని పాలించాల్సిన సిద్ధార్థుడు సమాజంలో ఉన్న అశాంతికి కారణం అనేకమైన కోరికలని భావించి ధ్యానంతో అశాంతిని దూరం చేసి శాంతియుతంగా మానవ వాళి జీవించాలని శాంతిని ప్రసాదించడానికి సిద్ధార్థుడు ధ్యానంతో జ్ఞానాన్ని పొంది గౌతమ బుద్ధుడిగా వారి బోధనల వెలుగులతో శాంతి మరియు జ్ఞానోదయం వైపు నడిపిస్తుందని, నేటి సమాజం కరుణ, జ్ఞానం మరియు ధ్యానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా థామస్, గుడిసె మనోజ్ కుమార్, మూలే కిషోర్, జింక శ్రీధర్, సుంకరి శ్రీకాంత్ యాదవ్, శ్రీహరి ముదిరాజ్, మహేష్, నేదురి రాజు, లక్కే సాగర్, కుమ్మరి నరేష్, అలువాల రాము, పొత్తూరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.