రోడ్లపై ధాన్యం పోయడం మానాలి:సిఐ సైదా

గజ్వేల్ మే (మన వార్త ప్రతినిధి జీ మురళి) రోడ్ల పై ధాన్యం కుప్పలు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారని, సాధ్యమైనంత వరకు రైతులు రోడ్ల పై ధాన్యం పోయారాదని గజ్వేల్ సిఐ బి సైదా సూచించారు సోమవారం గజ్వేల్ సిఐ సైదా మీడియాతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు, మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక కొంతమంది గాయాలపాలు కావడం, ప్రమాదం జరిగి చనిపోతున్నారని, బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దన్నారు. రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు అవి తగిలి చనిపోవడం జరుగుతుందని, ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Comment