గజ్వేల్ సెప్టెంబర్ 16 మన వార్త ప్రతినిధి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలి,యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు అని గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ రవి కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ పట్టణంలో మార్కెట్, ఓల్డ్ మార్కెట్, పాన్ షాప్స్, టీ కొట్టు, కిరాణా షాప్స్, మరియు తదితర అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్,1908 లేదా హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని,డాగ్ స్క్వాడ్ సిబ్బంది అజయ్ కుమార్, రమేష్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.