రోడ్డు మరమ్మత్తులు చేపించండి సారు…ప్రజల ఆవేదన..**మండలాధికారులు,గ్రామ అధికారులు,ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళండి..

*ఇల్లంతకుంట,సెప్టెంబర్ 12 (మన వార్తా ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామం నుండి రహీంఖాన్‌పేటకు వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అడుగు అడుగున గుంతలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.గుంతల మయం కావడంతో ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనంతారం గ్రామస్థులు మాట్లాడుతూ—“మేము సిరిసిల్లకు వెళ్లాలంటే ఇల్లంతకుంట మీదుగా తిరగాల్సి వస్తోంది.రహీంఖాన్‌పేట–అనంతారం మీదుగా నడిచే బస్సులు కూడా ఇప్పుడు అనంతారం వరకు రావడం లేదు.డిపో అధికారులను అడిగితే..రోడ్డు బాగాలేదని సమాధానం ఇస్తున్నారు.మండల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు..అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గ్రామ ప్రజలు తమ సమస్యలను..మండల అధికారులు,గ్రామ స్పెషల్ అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి ఎమ్మెల్యే దృష్టికి తీసుక వెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..కనీసం తాత్కాలికమైనా రహదారి మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.రోడ్డు పునరుద్ధరించబడితే బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమవుతాయని,తమ ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment