యూరియా రైతులకు ఇచ్చేది ఎప్పుడు వ్యవసాయం చేసేది ఎప్పుడు….

*హాసన్ పర్తి సెప్టెంబర్ 09(మన వార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా మసన్పర్తి మండల పరిధిలోని సిద్దాపుర్ పిఎసిఎస్సి కార్యాలయం వద్ద రైతుల ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం అనే పథకాలను ఆమోదిస్తున్నట్లు ప్రచారం చేస్తుంది.హనుమకొండ జిల్లాలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా సంబంధిత అధికారులు అవసరమైన అంత యూరియా అందుబాటులోకి ఎందుకు తేలేకపోతున్నారు.ఇప్పటికీ జిల్లాలో ఆయా మండలాలలో వ్యవసాయం చేసేందుకు వెళ్లాల్సిన రైతులు యూరియా కోసం పిఎసిఎస్సి ఎదుట నిరీక్షిస్తున్నారు.యూరియా కోసం చెప్పులు క్యూ లైన్ గా పాటిస్తూ రాత్రి 7 గంటలనుండి వేచి చూస్తున్నారు.యూరియా సమృద్ధిగా.ఉందా లేక రావాల్సి ఉందా ఏంటన్న సంగతి సంబంధిత అధికారులు పరిస్థితులను సర్దుబాటు చేసే క్రమంలో సమాధానం చెప్పాల్సిన వారు కనిపించకపోవడంతో పలుచోట్ల అల్లర్లు,తోపులాటలు,జరుగుతున్నాయి వ్యవసాయం చేసి ప్రజలకు అన్నం పెట్టాల్సిన రైతులు యూరియా కోసం ప్రాదయపడుతూ పిఎసిఎస్సి కార్యాలయం చుట్టూ రాత్రి పగళ్ళు వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాగే కాలం గడిచే కొద్దీ వ్యవసాయానికి పూర్తిస్థాయిలో ఆటంకం ఏర్పడుతుంది ఇప్పటివరకు వ్యవసాయానికి సహాయం అందడం లేదని రైతులు గ్రామీణ ప్రాంతాలు వదిలి పట్టణాలకు వలసలు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి.మరికొంతమంది ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని కష్టపడటం ఇష్టం లేక వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించి రోజువారి కూలీగా పనులకు అలవాటైపోతున్నారు.వ్యవసాయం కాస్త యూరియా కారణంగా మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని హాసన్ పర్తి,సిద్దాపూర్ గ్రామాల్లోని రైతులు మంగళవారం పిఎసిఎస్సి వద్దకు వందలాదిగా చేరుకున్నారు రైతులకు తగినంత యూరియా లేకపోవడంతో శిరాశతో వెనుదిరిగి ఇంటి బాట పట్టారు యూరియా కోసం జరుగుతున్న ఈ ఇబ్బందులను ఎంతకాలం జరుగుతుంది అని రైతులు మండిపడుతున్నారు ఇలాగే ఇబ్బందులు పెడతారా అని అధికారులను ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్న రైతులు.

Leave a Comment