వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు రేగుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీరామోజు లిఖితకు 10, 000 రూపాయల చెక్కును ఆర్థిక సాయం అందజేశారు. మానవతా దృక్పధంతో ఆదుకున్న 98 చారిటబుల్ ట్రస్ట్ కు, స్థానిక బీజేపీ నాయకులు రేగుల శ్రీకాంత్ కు శ్రీరామోజు లిఖిత ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు హింగే శివమ్, కోశాధికారి సుమన్, ముఖ్య సలహాదారు, బీజేపీ పట్టణ అధ్యక్షుడురాపెల్లి శ్రీధర్, బీజేపీ నాయకులు సంటి మహేష్, తదితరులు పాల్గొన్నారు.