ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా చూడండి…అట్టి భూమిని నిరుపేదలకు అందివ్వండి అఖిలపక్షం ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం….

నార్సింగ్ సెప్టెంబర్ 9( మన వార్తా ప్రతినిధి ) నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ గ్రేస్ బాయి కు వినతి పత్రాన్ని అందజేశారు. తాము నిరుపేదల మని తమకు బ్రతుకు దెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని, తమ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబరు 88 (గాడిది గుట్ట) లో గల ప్రభుత్వ భూమి లో తమకు కొంత భూమి కేటాయిస్తే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించు కుంటామని, తమను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని స్థానిక తహశీల్దార్ కు విన్నవించుకున్నారు. అనంతరం అర్జీదారులు, నాయకులు మాట్లాడుతూ సర్వే నం 88 లో గల భూమి అన్యాక్రాంతం అవుతుందని, నాయకులు ఆర్థికంగా ఉన్న వారి కబ్జాలోకి పోతుందని అన్నారు. డబ్బులు ఉన్న పెద్ద మనుషుల అధీనంలోకి ప్రభుత్వ భూమి వెళ్లకుండా, పూట గడవడమే కష్టంగా ఉన్న నిరు పేదలకు భూమి కేటాయిస్తే వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతారని అన్నారు. పేదల బాగు కోసం రాజకీయాలను పక్కన పెట్టి, అఖిలపక్షం ఆధ్వర్యంలోతహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు, ఈ సందర్భంగా తహశీల్దార్ సానుకూలంగా స్పందించారని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళతానని, వారి ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ జరుగుతుందని తహసిల్దార్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగర్ల గోవర్ధన్, గోండా స్వామి యాదవ్, శ్రీరామ్ భరత్, లక్ష్మీ నరసింహులు, నాగరాజు, చిన్న కృష్ణా గౌడ్, కందరి శ్రీనివాస్, శంకర్, మ్యాకల శ్రీనివాస్, ఇండ్ల శ్రీనివాస్, గణేష్, అనిల్, మోహన్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment