తూప్రాన్ లో యూరియా కోసం రైతుల పడి గాపులు…..

తూప్రాన్ ఆగస్టు 8 (మన వార్తా ప్రతినిధి)యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. తూప్రాన్ లోని ఫర్టిలైజర్ షాపుల ముందు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్లతో ఉదయం నుండే బారులు తీరారు. సరిపడా యూరియా రాకపోవడంతో టోకెన్లు పొందిన రైతులకు సైతం యూరియా దొరకకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే సరైన దిగుబడి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వరి పంటపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందేమోనని రైతులు భయాందోళనలో ఉన్నారు.ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తేవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment