యూరియా కోసం తూప్రాన్ లో రోడ్డెక్కిన రైతులు..ఉత్తి మాటలైన మంత్రి ఆదేశాలు….

తూప్రాన్ సెప్టెంబర్ 9 (మన వార్తా ప్రతినిధి) రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద యూరియా పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది.రైతు వేదికల వద్ద టోకెన్లు ఇవ్వమని రైతులు నేరుగా ఫర్టిలైజర్ షాపులలో యూరియా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలతో విసుగెత్తిన రైతులు మంగళవారం తూప్రాన్ లో రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాపనార్ధాలు పెట్టారు. రైతుల రాస్తారోకతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతుల రాస్తారోకోను విరమింప చేశారు.

Leave a Comment