రికార్డు ధర పలికిన దత్తత్రేయ దేవాలయం వినాయకుడి లడ్డు.

మొయినాబాద్ సెప్టెంబర్ 06:మన వార్త ప్రతినిధి.

మొయినాబాద్ మండలం లోని కనకమామిడి దత్తత్రేయ దేవాలయం వినాయక లడ్డు ఏకంగా 5 లక్షలు పలికింది. కనకమామిడి కి చెందిన ఎన్ ఎన్ సీ బ్రదర్స్ వేలంపాటలో లడ్డుని దక్కించుకున్నారు. వారు మాట్లాడుతూ గననాధుని నమ్ముకుంటే కచ్చితంగా మంచి జరుగుతుంది అన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు కనకమామిడి ప్రజలపై ఎల్లపుడు ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

Leave a Comment