- హోరాహోరీగా లడ్డూ వేలం పాట.
- 54100 కి లడ్డూని కైవసం చేసుకున్న వల్లెపు విష్ణువర్ధన్ దంపతులు.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్7, మనవార్త.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రెండవ డివిజన్లోని చెంగిచెర్ల కాకతీయ కాలనీ ఫేస్ టు లో ఆఖరి రోజు గణేష్ నిమజ్జనం వేడుకలు మహిళల కోలాటాలతో, పిల్లల నృత్యాలతో ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు. ముందుగా డిజె సౌండ్ లతో, ఎంతో ఆసక్తిగా పిల్లలు మహిళలు అందరూ, ఆటపాటలతో, ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని, తర్వాత చిన్న లడ్డు లక్కీ డ్రా తీసి లక్కీ డ్రా లో గెలుపొందిన దంపతులను చిన్న లడ్డు వారికి ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రతి సంవత్సరం అందరూ ఎంతో ఆసక్తిగా చూసే పెద్ద లడ్డు వేలంపాట గత ఏడాది 35 వేలు ధర పలికి ఈసారి ఎంతో ఉత్కంఠగా మొదలై హోరాహోరీగా వేలంపాటలో పాల్గొని 54,100 కి లడ్డూని కైవసం చేసుకున్న వల్లెపు బ్రహ్మయ్య ధనలక్ష్మిల కుమారుడు వల్లపు విష్ణు వర్ధన్ నాగజ్యోతి దంపతులు. వారికి మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పెద్ద లడ్డు వారికి ఇచ్చి ఘనంగా సత్కరించిన కమిటీ సభ్యులు. అనంతరం రాంపల్లి చెరువు వద్ద బై బై గణేశ నినాదాలతో ఆ గణపయ్యకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు భాస్కర్ చారి, ప్రధాన కార్యదర్శి రామ్ చరణ్, కోశాధికారి సత్యనారాయణ, కమిటీ ముఖ్య సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిరాజు, మహేందర్, అజయ్, విక్రం, మహేందర్, ఉపేందర్, కాలనీ మహిళలు అనురాధ,మంగమ్మ,అంజమ్మ,అరుణ,కవిత,శృతి,కారుణ్య, అంజమ్మ,రాధిక,స్రవంతి, కాలనీవాసులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.