ఇల్లంతకుంట ఆగస్టు 31 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ లో టీజీ-ట్రాన్స్కో వారి అంతర్గత పనులు,మరియు అత్యవసర మరమ్మత్తులు ఉన్నందున రేపు సోమవారం (తేదీ :01-09-2025) మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉన్నదని సెస్ ఏఈ నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఏఈ తెలిపిన వివరాల ప్రకారం ఇల్లంతకుంట 132 కె. వి. సబ్ స్టేషన్ పరిధిలోని 33 కె.వి.సబ్-స్టేషన్ల క్రింద ఉన్న అన్ని గ్రామాలు ఇల్లంతకుంట,సోమవారంపేట,అనంతగిరి,పెద్దలింగాపురం,చీర్లవంచ,రాంచంద్రపూర్,రహీంకణపేట,కందికట్కూర్ సబ్-స్టేషన్ల క్రింది అన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం రేపు మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది.కావున మండలంలోని అన్ని గ్రామాల గౌరవ విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు అని పేర్కొన్నారు.