మండలంలో ఎటు చూసినా సమస్యలే…బీఆర్ఎస్ నాయకుడు మల్యాల రాజశేఖర్ ఆవేదన…

ఇల్లంతకుంట,ఆగస్టు 30 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజలు రహదారులా గురించి,రైతన్నలు యూరియా కొరత గురించి,అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అనంతారం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్యాల రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలోని రహదారి..సమస్యలు తీవ్రంగా ఉన్నాయని,పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు,పలు గ్రామాల ప్రజలు మండలానికి వెళ్లడానికి ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రైతులేమో పంటలు పండించినా,అత్యవసరమైన దశలో యూరియా అందక ముప్పు తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు.“మండలంలో ఇన్ని సమస్యలు ఉన్నా అధికారులు,ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.ఈ విషయాలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్తున్నాయా? లేక ఎమ్మెల్యేనే పట్టించుకోవడంలేదా?అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే మండల ప్రజలతో,రైతులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించక తప్పదని స్పష్టం చేశారు.

Leave a Comment