ఉత్తర తెలంగాణ శాస్త్రీయంగా,చట్టబద్ధంగా పలుమార్లు రిజర్వేషన్లను ఇస్తామన్న సిఎం,పార్టీ పర ఆలోచన వద్దంటే వద్దు!ఎన్నికల జాప్యం అయిన సరే!చట్టబద్ద రిజర్వేషన్లుకావాలి90 రోజులకు మించి ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండద్దన్న సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా,కోర్టు ధిక్కరణ క్రింద సుప్రీంకోర్టు కెళ్ళుటకు జాప్యం వద్దు!30న కేబినెట్లో,జరుగనున్న అసెంబ్లీలో కోర్టు ధిక్కరణ క్రింద సుప్రీం కోర్టుకు వెళ్ళేలా నిర్ణయించండి!జాప్యంతో బీసీల ఆగ్రహం పార్టీల మనుగడకు ప్రశ్నార్థకం!రిజర్వేషన్లకు అడ్డుపడుతూ,ఎన్నికల జాప్యానికి,గ్రామాల అభివృద్ధి కుంటు పడుటకు కారకులైన పార్టీలకు,నేతలకు బీసీ వర్గాలు బుద్ధి చెప్పడం ఖాయం! 50 శాతం రిజర్వేషన్లు మించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, 2019 లో 9 శాతం లేని ఈడబ్లూఎస్ వర్గాలవారికి 10 శాతం రిజర్వేషన్లను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో అర్థం కావడం లేదని,56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం నాన ఇబ్బందులు పెట్టుచుండేనని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ తన ఆవేదనను వ్యక్త పరిచారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో,విద్య,ఉపాధి,ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆమోదించి,ఆమోధంకై వేరు వేరుగా బిల్ నెంబర్ 3,బిల్ నెంబర్ 4 లను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని,అసెంబ్లీ సాక్షిగా డిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని నిండు సభలో మాటిచ్చి, అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్ళకుండ,కాంగ్రెస్ పార్టీ నాయకులను,పలువురు మంత్రులను,ప్రజాప్రతినిధులను డిల్లీకి తీసుకెల్లి ప్రధానిని, రాష్ట్రపతిని కలవకుండా ధర్నా చేపట్టి విజయధరహాసంతో రావాల్సిన సిఎం వట్టి చేతులతో రాష్ట్రానికి చేరుకోవడం బాధాకరమని నరేందర్ అన్నారు.రాష్ట్ర బీజెపీ నేతలు ,కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుల ఆమోదానికి సహకరించడం లేనందున, కలిసొచ్చే పార్టీలతో,బీసీ వర్గాలతో, మేధావులతో, సామాజికవేత్తలతో, న్యాయనిపుణులతో,మేధావి వర్గాలతో ఢిల్లీని దిగ్బంధం చేయాలని,అలాగే రాష్ట్రం నుండి రాష్ట్రపతికి పంపిన బిల్లులు 90 రోజుల కంటే ఎక్కువ రోజులు పెండింగ్లో ఉండరాదని సుప్రీం కోర్టు తీర్పు మేరకు ,బీసీ బిల్లులు కేంద్రానికి పంపి సుమారు 4 నెలలు కావస్తున్నందున, ఈ నెల 30 న జరుగు క్యాబినెట్లో, త్వరలో జరుగనున్న అసెంబ్లీలో తీర్మానం చేసి,సుప్రీం కోర్టును ఆశ్రయించి,చట్టబద్ధంగా,ఎన్నికలు జరిపించాలని నరేందర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లను సాధిస్తామన్న మీరే,పార్టీ పరంగా రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపితే నవ్వుల పాలవుతారని,మాట తప్పినవారవుతారని,నమ్మిన బీసీలను మోసం చేసినట్లు అగునని, ఎన్నికల జాప్యం జరిగిన సరే అని,పార్టీ పర రిజర్వేషన్లు వద్దే వద్దని,బీసీ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని,రాబోవు ఎన్నికల్లో బీసీ వ్యతిరేక పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవునని ,బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని నరేందర్ అన్నారు.