కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ అశోక్ సస్పెండ్……

కుత్బుల్లాపూర్ ఆగష్టు 23( మన వార్త ప్రతినిధి రాజు)మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారు. బాచుపల్లి లో సర్వే నెంబర్ 83 భూ నిషేధం లో ఉన్న భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నిషేధిత భూమి బదిలీలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. కోట్లు విలువ చేసే భూమిని సబ్ రిజిస్ట్రార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారని 22ఏ లో, నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం పై ఐజి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Leave a Comment