మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 22 మన వార్త : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని వెంకటాపురం డివిజన్ ప్రాంతంలో పలు కమర్షియల్ సంస్థలు రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాచర్ల కిచెన్స్, పంజాబీ తడక వంటి హోటళ్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీమ్ పార్లర్ వంటి వ్యాపార సంస్థలు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని వాణిజ్య లాభాలు పొందుతున్నాయి. ఫలితంగా రోడ్లపై అక్రమ నిర్మాణాలు పెరిగి, వాహనదారులకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.కాలనీ వాసులు మాట్లాడుతూ,కాలనీ రోడ్లు ఇప్పటికే సన్నగా ఉండటంతో పార్కింగ్ సమస్యలు మరింత పెరిగాయి. ప్రతి రోజు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.స్థానిక ప్రజలు ఈ సమస్యపై జీహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి, అక్రమ పార్కింగ్, అనుమతి లేని వాణిజ్య వినియోగం పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.