రహదారుల నిర్లక్ష్యం–విద్యార్థుల ఇబ్బందులు..ఎన్‌హెచ్‌ఆర్‌సి మండల అధ్యక్షుడు కాసుపాక శ్రీనివాస్ ఆవేదన….

.ఇల్లంతకుంట,ఆగస్టు 23 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామానికి వెళ్లే రహదారులు బాగా దెబ్బతిన్నాయి.అనంతారం,వెల్జిపూర్,ఓబులాపూర్ గ్రామాల నుండి రోజూ దాదాపు 400 మంది విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్‌కి ఆటోలు,బస్సులలో వస్తున్నారు.రోడ్డు పరిస్థితి చాలా దుర్భరంగా ఉండటంతో ప్రయాణం కష్టమైపోతోంది.వర్షాకాలంలో బురద,గుంతల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.“ప్రభుత్వాలు మారుతున్నా రహదారులు మాత్రం అలాగే ఉన్నాయి.వెంటనే మరమ్మత్తులు చేయాలి,”అని ఎన్‌హెచ్‌ఆర్‌సి మండల అధ్యక్షుడు కాసుపాక శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్.హెచ్.ఆర్.సి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి మండల నాయకులు మనోహర్,నారెడ్డి రాజశేఖర్,బాబులు పాల్గొన్నారు.

Leave a Comment