అనంతారంలో ఉపాధి హామీ పనుల జాతర…వంద రోజులు పూర్తి చేసిన కూలికి సన్మానం,భూమి పూజలతో కొత్త పనులకు శ్రీకారం…

.ఇల్లంతకుంట ఆగస్టు 22 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ స్పెషల్ అధికారి ఎంపిడిఓ శశికళ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రతను అందించే ముఖ్య పథకమని అన్నారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అధికారి విజయలక్ష్మి పనుల జాతర కార్యక్రమంలో శుక్రవారం ఇంకుడు గుంత పనులకు భూమి పూజ నిర్వహించి,ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పూర్తి చేసిన ఉపాధి కూలీ వొల్లాల లింగయ్యను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ పుష్పలత,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ,మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment