ఫాదర్ బాలయ్య నగర్‌లో పొలిమేరాస్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన…..

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 21 మన వార్త :అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్‌ లో ఉన్న పొలిమేరాస్ షాప్‌లో పని చేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.షాప్ యాజమాన్యం గత రెండు నెలలుగా అక్కడ పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో పనిచేస్తున్న మహిళలు ఒక్కొక్కరు రూ.12,000 చొప్పున పది మంది కార్మికులు తమ వేతనాలు పొందలేదని బాధతో తెలిపారు.జీతాలు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.స్థానికులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్మికుల కష్టానికి తగిన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Comment