ఘనంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…

-నాగ పత్రిష్ట చేసి మొక్కు తీర్చుకున్న మైనం పల్లి హనుమంత రావు…
గజ్వేల్:మే 10 (మన వార్త జీ మురళి) గజ్వేల్ మండలం దిలాల్పూర్ లోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా నాగ ప్రతిష్ట చేశారు. గత ఏడాది లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఆలయ ప్రాంగణంలో నాగ ప్రతిష్ట చేసి మొక్కు తీర్చుకున్నారు. కాగా గత రెండు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో తిరుమల రఘునాథ చార్యులు వైదిక నిర్వహణలో ప్రతిరోజు ఆలయంలో పురుష సూక్త సహిత మూలమంత్ర హవనములు నిర్వహిస్తున్నారు. ఆదివారం సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహ స్వామికి శతకటాభిషేకం, చక్ర స్నానం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి పుష్ప రథోత్సవం ఘనంగా జరగనుంది. ఆదివారం జయంతిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బురుజు కింది సంతోష్ రెడ్డి, కోశాధికారి అత్తెల్లి రాజేశం గుప్త, కార్యదర్శి రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి రాజిరెడ్డి, కొండల్ రెడ్డి,ముత్యం రెడ్డి, రవీందర్ రెడ్డి, లచ్చిరెడ్డి, రాష్ట్ర సర్పంచ్ ఫోరమ్ ల రాష్ట్ర కన్వినర్ చిట్కుల్ మైపాల్ రెడ్డి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గాడిపల్లి రఘు వర్ధన్ రెడ్డి, ములుగు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, కొమ్ము విజయ్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్, అనిల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉప్పల ప్రవీణ కృపానందం, రాజశేఖర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కప్ప భాస్కర్, నాయిని తిరుపతి, జూనీ, రాజు, రవి గౌడ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment