-సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దు…
-పోలీసులు,ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలి: జిల్లా ఎస్పీ మహేష్ …
(మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) భారతదేశ వ్యాప్తంగాగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో జిల్లాలో నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.శనివారం రోజున జిల్లాలోని వేములవాడ దేవస్థానం,నాంపెళ్లి గుడి,మిడ్ మ్యానేర్ డ్యామ్ తో పాటుగా సిరిసిల్ల,వేములవాడ బస్టాండ్ లలో బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ టీమ్ తో తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు ప్రత్యేక బలగాలతో తనిఖీలు ముమ్మరం చేయడం జరుగుతుందన్నారు.జిల్లాలోని బస్టాండ్లు,దేవస్థాన ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కువగా గుమికూడే,పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని,ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి,ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు కనపడిన వెంటనే 100 నెంబర్ కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలి.ప్రజల సహకారం వల్లే సమాజాన్ని మరింత భద్రమైనదిగా తీర్చిదిద్దగలమన్నారు.సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని,అనాధారిత సమాచారాన్ని సోషల్ మీడియా గ్రూప్ లలో ఫర్వార్డ్ చేయవద్దని, పోలీసులు,ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలన్నారు.