వేములవాడ ఆగష్టు 21 (మన వార్త ప్రతినిధి )
వేములవాడ టియుడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ పాత్రికేయులు మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహామ్మద్ రఫీక్ శుక్రవారం రోజున జరిగే ఉచిత మెగా వైద్య శిబిరానికి రావాలని ప్రభుత్వ విప్ కు ఆహ్వానం పలికారు.వైద్య శిబిర నిర్వహణపై క్లుప్తంగా వివరించారు. దీనిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, ఆర్గనైజ్ సెక్రెటరీ విష్ణు పాల్గొన్నారు.