సుచిత్ర జంక్షన్‌లో ట్రాఫిక్ సవరణలు – ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 20 మన వార్త : ప్రజల అభ్యర్థన మేరకు, వారి విలువైన సమయాన్ని ఆదా చేయడం, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ రాకపోకలకు ప్రాధాన్యత కల్పించడం, అలాగే శబ్ద, గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సీనియర్ అధికారుల అనుమతితో సుచిత్ర జంక్షన్‌ను మూసివేసి ట్రాఫిక్ సవరణలు చేపట్టారు అని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.ఈ క్రమంలో అల్వాల్ వైపు నుండి వచ్చే వాహనదారులు పిల్లర్ నెం. 45 వద్ద ఏర్పాటు చేసిన యూ-టర్న్ ద్వారా కుత్బుల్లాపూర్ మేడ్చల్ వైపుకు వెళ్లే వీలుంటుంది. అలాగే బోయిన్‌పల్లి వైపు నుండి వచ్చే వాహనదారులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద యూ-టర్న్ తీసుకోవాలని సూచించారు.ఇక పాదచారుల భద్రత కోసం ప్రతి మూడు నిమిషాలకు 30 సెకన్ల సమయాన్ని కేటాయించి రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఈ చర్యలు కొనసాగుతాయని ఏసీపీ ట్రాఫిక్ మేడ్చల్ స్పష్టం చేశారు.

Leave a Comment