కారు బైకు ఢీకొని ఒకరు మృతి….

గంభీరావుపేట. ఆగస్టు 20 మన వార్త ప్రతినిధి.✍️మధ్యాహ్నం 02:30 గంటల సమయంలో పాల్వంచ మర్రి గ్రామం కు చెందిన కడమంచి వెంకటి సముద్ర లింగాపూర్ కు వెళ్లి తన యాక్టివా పై బండి నెంబర్ TS17H 9828 గలదానిపై తిరిగి ఇంటికి వచ్చుచుండగా మార్గమధ్యంలో పెద్దమ్మ స్టేజి మూల మలుపు వద్ద ఎదురుగా కారు నెంబర్ TS 23G0580 గల కారు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి యాక్టివాకు టక్కరు ఇవ్వగా వెంకటికి రక్తగాయములు కాగా చికిత్స గురించి నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకపోగా డాక్టర్ పరీక్షించి చనిపోయినాడు అని తెలిపినాడు. మృతిని భార్య లీల ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినామాని ఎస్ఐ రమాకాంత్ గంభీరావుపేట ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Comment