మచ్చబొల్లారం అక్బర్జిగూడా ముస్లిం గ్రేవియార్డ్ వద్ద ఆందోళన….

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మన వార్త :మచ్చబొల్లారం అక్బర్జిగూడా ముస్లిం గ్రేవియార్డ్ వెనుకభాగంలోని కాంపౌండ్ వాల్ దెబ్బతినడంతో సమస్యలు తలెత్తాయి. పైగా, గ్రేవియార్డ్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ నుండి మురికినీరు లోపలికి వదలడంతో తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఈ ఘటనపై గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డంపింగ్ యార్డ్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.హిందువుల స్మశానవాటికను తొలగించిన తర్వాత, ఇప్పుడు మా ముస్లిం గ్రేవియార్డ్ పైన కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. మా గ్రేవియార్డ్‌ను మా ఇళ్ల పరిసరాలుగా భావించి చూసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతాం” అని హెచ్చరించారు.స్థానిక ప్రజలు కూడా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Leave a Comment