మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్…

మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్: వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీ.ఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడిన వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీ.ఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపిన 100మందికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. మద్యం త్రాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి కావద్దని వాహనదారులకు సూచించారు. మద్యం త్రాగి వాహనాలు నడుపుతూ పదే పదే పట్టుబడినా వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని అన్నారు. కౌన్సిలింగ్ అనంతరం పట్టుబడిన వారినీ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment