ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

వేములవాడ ఆగస్టు 15 ( మన వార్త ప్రతినిధి)

వేములవాడ పట్టణ ఆరవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆర్య వైశ్య పట్టణ అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు మాట్లాడుతూ, బ్రిటిష్ పరిపాల నుండి విముక్తి చేసి స్వాతంత్రం తెచ్చిన అమరవీరులను స్మరించుకుంటూ దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని అలాగే పట్టణ ఆర్యవైశ్యులు కూడా ఐక్యంగా ఉండి సంఘం గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, మహిళలు,వైశ్య నాయకులు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.

Leave a Comment