పలు సమస్యలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్ కార్యవర్గం.. -సానుకూలంగా స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి…

వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గం గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ కోర్టులో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు, ఫస్ట్ అడిషనల్ కోర్టు, కోనరావుపేట మండలాన్ని వేములవాడ కోర్టుకు బదిలీ చేయుట, కోర్టు బిల్డింగ్ పై అంతస్తు నిర్మాణం, తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది.అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిని మాధవి, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి రాధికా జశ్వాల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, రాజన్న లడ్డు ప్రసాదం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, లైబ్రరీ సెక్రెటరీ పంపరి శంకరయ్య, కనికరపు శ్రీనివాస్, గుడిపల్లి మహేష్, మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ, తమ్మిరి అన్నపూర్ణ పాల్గొన్నారు.

Leave a Comment