.నిజాంపేట ఆగష్టు 5(మన వార్త ప్రతినిధి నరేందర్)రైతులకు ఎరువుల కొరత ఉండడంతో నిజాంపేట సొసైటీ వద్ద రైతులు పడి కాపులు కాస్తున్నారు.రెండు రోజుల క్రితం లారీ లోడ్ యూరియా రావడంతో త్వరగా అయిపోవడం జరిగిందని రైతుల నుండి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ ద్వారా యూరియా అందిస్తున్నామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. సొసైటీ గోదాంలో యూరియా లేకపోవడంతో రెండు రోజుల నుండి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని జిల్లా అధికారుల సైతం రైతులకు సరిపడే యూరియా నిల్వ ఉందని చెబుతున్న ఇక్కడ మాత్రం యూరియా కొరత ఉన్నదని ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా రైతులకు అందించాలనీ రైతుల కోరుతున్నారు.