అల్వాల్–కొంపల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం – వృద్ధుడు మృతి…..

మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 5 మన వార్త అంతోని అల్వాల్ కొంపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడు దురదృష్టవశాత్తు మృతి చెందాడు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల దర్యాప్తు ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు సేకరిస్తున్నారు.సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది వృద్ధుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.ఈ ఘటనతో అల్వాల్–కొంపల్లి రహదారి పరిసరాల్లో విషాద వాతావరణం నెలకొంది.

Leave a Comment