ప్రతాప్ రెడ్డి డైరెక్షన్లో*…*పనిచేస్తున్న నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడమే వారి లక్ష్యం అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం నాయిని యాదగిరి నైజం *పదవులు కట్టబెట్టిన ప్రతాప్ రెడ్డి రుణం తీర్చుకుంటున్న నాయిని యాదగిరి**పిల్లికి కూడా బిచ్చం పెట్టని మల్లారెడ్డి పార్టీకి ఖర్చు పెట్టానని అనడం సిగ్గుచేటు…..

గజ్వేల్ ఆగస్టు 05 (మన వార్త ప్రతినిధి జీ మురళి) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను రచ్చ చేసేందుకు ప్రతాపరెడ్డి కుట్ర పన్నగా, అందులో నాయిని యాదగిరి, మల్లారెడ్డి పావులుగా మారినట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేత సమీర్, మాజీ కౌన్సిలర్ నక్క రేగొండ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్ మాజీ ఎంపీటీసీ అంజి యాదవ్ విమర్శించారు. సోమవారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తమకు ఎలాగూ స్థానం లేదని గ్రహించిన వారు ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా, మంత్రి వివేక్ వెంకటస్వామి సభను రచ్చ చేసేందుకు ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఉందని అన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి నేతృత్వంలో పంపిణీ ప్రక్రియను పండగ వాతావరణంలో జరిపేందుకు నిర్ణయం తీసుకోగా, ఆయన నేతృత్వంలో మంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు గుర్తు చేశారు. వర్గల్, ములుగు, మర్కుక్, జగదేవపూర్ మండలాల పరిధిలో ప్రశాంతంగా జరగగా, గజ్వేల్ లో మాత్రం రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించడానికి మంత్రి సిద్ధమవుతున్న తరుణంలో నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలు సంతోషంగా ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కోవర్టు రాజకీయాలు చేస్తూ వారు కుట్ర పన్నినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆహ్వానం లేకుండానే వారు పోలీసుల కన్నుగప్పి సభ ప్రాంగణంలోకి చొచ్చుకొని వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో వారు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మంత్రిని తప్పుదోవ పట్టించే విధంగా వాగ్వాదానికి దిగినట్లు చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో భారీ కాన్వాయ్ మధ్య ఘన స్వాగతం పలకగా, వారు జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పారు. మొదటి నుండి అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి నైజం కాగా, పిల్లికి బిచ్చం వెయ్యని వారు పార్టీ కోసం ఖర్చు పెట్టానని అనడం సిగ్గుచేటని నిలదీశారు. గజ్వేల్ నియోజకవర్గంలో మండలానికి ఇద్దరు ముగ్గురిని పోగుచేసుకొని గొడవలు చేయడం లక్ష్యంగా పెట్టుకోగా, పద్ధతి మార్చుకోకుంటే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని విచ్చిన్నం చేయడమే వారి లక్ష్యం కాగా, గతంలో పదవులు కట్టబెట్టిన ప్రతాప్ రెడ్డి రుణాన్ని ఈ విధంగా నాయిని యాదగిరి తీర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తమ లబ్దికోసం కలసి మెలసి ఉంటున్న మైనంపల్లి హన్మంతరావు, తూoకుంట నర్సారెడ్డి మధ్య నాయిని యాదగిరి చిచ్చుపెట్టి కాంగ్రెస్ పార్టీకి శకునిలా వ్యవహరిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం వారికి వెన్నతో పెట్టిన విద్య కాగా, నర్సారెడ్డి ద్వారా పదవులు పొందిన యాదగిరి, మల్లారెడ్డిలు ఆయన పైనే విమర్శలు చేయడం సహించమని అన్నారు. కాగా వారికాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, ఇప్పటికే తగిన ఆధారాలు సేకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గాడేపల్లి శీను చెప్పాల శేఖర్ కన్నా యాదవ్ డప్పు గణేష్ బాలు అరుణ్ సుంకం సురేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment