మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 4 మన వార్తా ప్రతినిధి అంతోని : అల్వాల్ సర్కిల్ లోని అంజనాపూరి కాలనీ, మచ్చ బొల్లారం, అల్వాల్ లోని ఒక ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి నగలు, నగదు దోచుకున్న దొంగల బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో 26 తులాల బంగారు నగలు, 20 గ్రాముల వెండి వస్తువులు, రూ.50,000 నగదు, మొబైల్ ఫోన్లు మరియు పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.ఫిర్యాదుదారు కుంబాల సుషాంత్ ఇచ్చిన పిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు Cr.No.793/2025 U/S 33 (4), 305 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 03.08.2025 నాటికి సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన నిందితుల వివరాలు 1. సయ్యద్ సోహెల్ 22 ఏళ్లు, పెయింటింగ్ వర్క్, చందరాయణగుట్ట, హైదరాబాద్ 2. మొహ్ద్ మోషిన్ 25 ఏళ్లు, పెయింటింగ్ వర్క్, రాజేంద్రనగర్ 3. మొహ్ద్ సమీర్ 26 ఏళ్లు, ఏసీ టెక్నీషియన్, రాజేంద్రనగర్ 4. షేక్ సైఫుల్ (26 ఏళ్లు, బంగారు పనివాడు, సదాశివపేట, సంగారెడ్డి జిల్లా రిసీవర్ నిందితుల నేరచరిత్ర సయ్యద్ సోహెల్ ఇంతకుముందు మల్కాజ్గిరి, నాచారం, చందానగర్, హైదరనగర్, కర్ణాటక మరియు వేపర్ పిఎస్ పరిధుల్లో 22 కేసులు.మొహ్ద్ మోషిన్ గుంటకల్ జిఆర్ పిఎస్ హైదరనగర్, కర్ణాటక మరియు వేపర్ పిఎస్ పరిధుల్లో 5 కేసులు.మొహ్ద్ సమీర్ ఈ దొంగతనంలో భాగస్వామి.ముగ్గురు కలిసి 29.07.2025న రాత్రి, ఇనుప రాడ్ సహాయంతో ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేశారు.గ్యాంగ్ నేరాల రికార్డు గత 3 నెలల్లో 13 కేసులు అల్వాల్, ఆమీర్‌పేట్, అంబర్‌పేట్, నాచారం, సికింద్రాబాద్ పరిధుల్లో 9 దొంగతనాలు తిరుమలగిరి పరిధిలో 1 కేసు వర్ధన్నపేట్ లో 1 కేసు వరంగల్ పరిధిలో 1 స్నాచింగ్ కేసు తాజా అంజనాపురి కాలనీ దొంగతనం స్వాధీనం చేసుకున్న వస్తువులు వెండి వినాయక విగ్రహం 4 వెండి మేత్తలు రూ.50,000 నగదు పల్సర్ బైక్ ఇనుప రాడ్ 5 సెల్‌ఫోన్లు నిందితులను కోర్టుకు తరలించగా, ఈ గ్యాంగ్ నేరాల వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.