యువత ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆగం కావద్దు..సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి….

.ఇల్లంతకుంట ఆగస్టు 04 (మన వార్త ప్రతిని):జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సోమవారం ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా “మీ కోసం” కార్యక్రమాన్ని ఇల్లంతకుంట ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా,సిరిసిల్ల రూరల్ సీఐ మొగలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,యువత ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్స్‌ వల్ల తాము అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,అప్పులు చేసి డబ్బులు పోగొట్టుకుని చివరకు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తరచూ ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్లైన్ గేమ్స్ వల్ల కూడా భారీగా నష్టపోతున్న యువతను చూస్తే దీనికి వ్యతిరేకంగా స్పష్టమైన అవగాహన అవసరమని అన్నారు.ఇలాంటి బెట్టింగ్ మరియు గేమింగ్‌లకు దూరంగా ఉండాల్సిన బాధ్యత యువతపై ఉంది అని సీఐ మొగిలి అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి యాప్స్‌ వైపు మొగ్గు చూపకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.జవారిపేట గ్రామంలో ఈ యాప్స్ వాడకానికి సంబంధించిన సమాచారం తమ దృష్టికి వచ్చినందున,ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.యువత మంచి మార్గాన్ని ఎంచుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని,ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉద్యోగావకాశాలు వినియోగించుకోవాలని సీఐ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment