నలుగురు పేకాట రాయుల అరెస్ట్ ఒక ఇన్నోవా కారు ఐదు మొబైల్ ఫోన్ లు స్వాధీనం…

చిన్న శంకరంపేట
ఆగష్టు 4
(మన వార్త ప్రతినిధి నరేందర్)
చిన్న శంకరంపేట మండలంలోని గవ్వల పల్లి రైతు వేదిక వెనకాల పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు, పేకాట ఆడుతున్న ఏడుగురిలో 1 సంగయ్య పల్లి గ్రామానికి చెందిన గొల్ల బాబు,
2, గబలపల్లి కోయమారి తండాకు చెందిన రామావత్ ప్రభాకర్,
3, తూప్రాన్ పట్టణానికి చెందిన ఏదునంద,
4, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ వేణు లు నలుగురిని పట్టుకోగా మరో ముగ్గురు
1, శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమార్,
2, గవలపల్లి గ్రామానికి చెందిన రెడ్డి శంకర్,
3, గవ్వలపల్లి గ్రామానికి చెందిన మచ్కూరి కేశవులు, పరారీలో ఉన్నట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు, వారి వద్ద నుండి ఒక ఇన్నోవా కారు రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు,

Leave a Comment