చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో APM, IKP CC,PACS ల సీఈఓ లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు, అకాల వర్షం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగంగా జరపాలని ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలు ట్యాబ్లో నమోదు చేసి రైతుల ఖాతాలు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆదేశించారు, ఈనెల 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని పూర్తిగా తరలించి కొనుగోలు కేంద్రాలను మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు, అకాల వర్షం వల్ల ధాన్యం తడిసినట్లయితే రైతులు దిగులు చెందవలసిన అవసరం లేదని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు, లారీల కొరత ఉన్నందున రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు ముందుకు వస్తే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు, ప్రాథమిక సహకార సంఘం సీఈఓ వాళ్ళ పని విధానం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, కొనుగోలు కేంద్రాల్లో సీఈవోలు నిర్లక్ష్యం చేయకూడదని పద్ధతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు చిత్తశుద్ధితో పనిచేసినట్లైతే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తాసిల్దార్ స్వప్న, ఐకెపి ఎపిఎం లక్ష్మీనరసమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పిఎసిఎస్ సీఈవోలు, తదితరులు పాల్గొన్నారు.