శంకరపట్నం:ఆగస్ట్04(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో అద్దె భవనంలో ఏర్పాటు చేసిన కేశవపట్నం పోలీస్ స్టేషన్ ను సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ప్రారంభించారు.కేశవపట్నం పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకోవడంతో మొలంగూర్ శివారులోని అద్దె భవనంలోకి మార్చారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపి గౌస్ అలాం మొక్కలు నాటారు.అద్దె భవనాన్ని ప్రారంభించి స్టేషన్ హౌస్ ఆఫీసర్,రైటర్ రూమ్, రికార్డుల గది,రిసెప్షన్ కౌంటర్, వెయిటింగ్ హాల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు,,కేశవపట్నం పోలీస్ స్టేషన్ పోలీస్ క్వార్టర్లు శిథిలవస్థకు చేరుకున్నాయి అన్నారు.ఇంతకుముందే పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు.త్వరలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు.ప్రజలకు సౌకర్యం గతంలో ఉన్న పోలీస్ స్టేషన్ సమీపంలోనే అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు అద్దె భవనంలో ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ లో సంప్రదించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, రూరల్ సీఐ వెంకటి,ఎస్ఐ శేఖర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.