శంకరపట్నం:ఆగస్టు04(మన వార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్) ను సందర్శన పరిశీలనలో భాగంగా కరీంనగర్ జిల్లా పరిశీలకుడు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ అధికారి ఏ.కృష్ణా రావు,క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డిలు సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. సరిత ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా ప్రమాణాలు,సాధించిన విజయాలు,ప్రత్యేక కార్యక్రమాలపై పరిశీలన చేశారు.మోడల్ స్కూల్, మరియు వసతి గృహంలో గల వివిధ సౌకర్యాలను పరిశీలించారు.గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్,సైన్స్ ప్రయోగశాలలు,ఫిజిక్స్ వాలా, ఖాన్ కాడమీ,తదితర విభాగాలను పరిశీలించడమే కాకుండా హాస్టల్ వసతులపై విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయుల బోధన పద్ధతులు, విద్యార్థులు చదువు నేర్చుకునే స్థాయిని పరిశీలించి పాఠశాలలో ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి వీ.సరిత అబ్జర్వర్లకు అవసరమైన అన్ని రిజిస్టర్లు,రికార్డులను సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.