గుర్తుతెలియని మృతదేహం లభ్యం…

చిన్న శంకరంపేటఆగస్టు 4(మన వార్త ప్రతినిధి నరేందర్) చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని జీకే వైర్ పరిశ్రమ సమీపంలో సోమవారం ఉదయం ఒక మగ వ్యక్తి మృతదేహం ఉన్నదని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, పంచనామ నిర్వహించి విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు, ఈ సందర్భంగా చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ సమాచారం మేరకు జీకే వైర్ పరిశ్రమ సమీపంలో ఒక మృతదేహం ఉన్నదని సమాచారం రావడంతో సంఘటన చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లూ తెలిపారు, మతిస్థిమితం లేని మృతదేహంగా గుర్తించడం జరిగిందని మృతుడు ఎవరనేది ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీసులను సంప్రదించాలని ఆయన తెలిపారు,

Leave a Comment